
పయనించే సూర్యుడుD.19.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ పీకే గంగాధర్. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
ఎస్ఐఆర్ (SIR) ఫేజ్-2లో భాగంగా ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైన నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిజామాబాద్ పట్టణంలోని ఎంకే గార్డెన్స్‌లో నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ టీపీసీసీ అంతే అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌గారు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ..ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన హక్కు అని అన్నారు. ఎస్ఐఆర్ ఫేజ్-2లో భాగంగా విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలను కలిపి సుమారు 1.50 లక్షల ఓట్లు ముసాయిదా జాబితాలో గల్లంతైనట్లు గుర్తించామని తెలిపారు. ఈ అంశాన్ని పార్టీ నాయకులు అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని, బూత్ స్థాయిలో గల్లంతైన ఓట్ల వివరాలను పరిశీలించి అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు తిరిగి ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలనిప్రజాస్వామ్యంలో ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు ఉండటం అత్యంత ముఖ్యమని, ఎలాంటి కారణంతోనైనా అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని షబ్బీర్ అలీ అన్నారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించి, అవసరమైన పత్రాలు, అభ్యంతరాలు, దరఖాస్తుల విషయంలో వారికి సహకరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..ఎస్ఐఆర్ ఫేజ్-2లో ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త పరిశీలించాలని సూచించారు. బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాలను పరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతైతే వాటిని గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ..ఓటర్ల జాబితా ముసాయిదాలో అర్హులైన వారి పేర్లు గల్లంతైతే వారికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు.గ్రామాలు, పట్టణాలు, వార్డులు, పోలింగ్ బూత్‌ల వారీగా జాబితాలను పరిశీలించి ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, ఓటర్లకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి సీతక్క సూచించారు.ఈ సమావేశంలో.. నిజామాబాద్ మేయర్ ఉమారాణి, ఎమ్మెల్యే మదన్ మోహన్, సునీల్ రెడ్డి, వినయ్ రెడ్డి, యూసుఫ్ అలీ, కాసుల బాలరాజ్, అరికెల నరసరెడ్డి, ఆకుల లలిత, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్, కార్పొరేషన్ చైర్మన్లు మనాల మోహన్ రెడ్డి, ఇరవత్రి అనిల్, కేశ వేణు, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.