
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 (సూళ్లూరుపేట నియోజకవర్గo రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ప్రతి రోజు రాకపోకలు సాగించే రోడ్డును ఆక్రమించి తమ సొంతానికి సంవత్సరాల తరబడి ఉపయోగించుకుంటుంటే చోద్యం చూస్తూ ఏమీ ఎరగనట్లు ప్రవర్తిస్తున్న సూళ్లూరుపేట మున్సిపా లిటీ అధికారులు నిమ్మకు నీరెత్తి నట్లు ఉంటునారు. సూళ్లూరుపేట పట్టణంలోని కావలి వీధి ఈ వీధిలో ఈ ప్రాంత వాసులకు నిత్యం రాకపోకలు సాధించేందుకు ఇబ్బందికరంగా మారింది 2019లో ప్రారంభించిన ఒక బిల్డింగ్ వర్క్ కొరకు ప్రతిరోజు ఈ రోడ్డును ఆక్రమిస్తూ మెటల్, ఇసుక, అని బిల్డింగ్ కు కావలసిన వస్తువులన్నీ రోడ్డుమీదనే ఉంచి రాకపోకలను అడ్డగిస్తూ ఈ బిల్డింగ్ ఓనర్ తన కార్య క్రమాలను నెరవేర్చుకుంటూ ఉంటే రోజూ ఇటువైపు వస్తున్న మున్సిపల్ అధికారులు ఎవరూ ఈ విషయంపై చర్య తీసు కోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది .. ఒకవేళ ఈ బిల్డింగు ఓనర్ మున్సిపల్ అధికారులకు బంధువై ఉండి ఉంటాడా? లేక పాలక అధికార పార్టీ కి చెందిన బంధువా అన్నందు వల్ల ఇతన్ని ఎవరు పట్టించుకోవడం లేదా? ఈ ప్రాంత ప్రజలు ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియక తికమక పడుతున్నారు . మున్సిపల్ అధికారులు దీని మీద చర్య తీసుకునే ఆలోచన కూడా రాలేదు యధా రాజా అంత అనుభవించు అని ఈ రోడ్డు ఆక్రమణ కార్యక్రమం ఇలానే జరుగుతుందా సంబంధిత అధికారికి తెలియాలి . మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా నిద్రలోంచి మేలుకొని రోడ్డుని డ్యామేజ్ చేస్తూ రాకపోకలకు అడ్డం కలిగించే వారి మీద చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు