
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. క్రీడాకారుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన నేత కేసీఆర్.. 2% రిజర్వేషన్‌తో ఉజ్వల ఉద్యోగ అవకాశాలు*ఓటమికి కుంగిపోకుండా పట్టుదలతో సాధన చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చు క్రీడలకు నిలయంగా బాల్కొండ నియోజకవర్గం.. కమ్మర్పల్లి స్టేడియం అభివృద్ధికి సంపూర్ణ సహకారం
కేసీఆర్ నిర్మించిన స్టేడియం వల్లే నేడు కమ్మర్‌పల్లిలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు సాధ్యమయ్యాయి వ్యాయామ ఉపాధ్యాయు ల అంకితభావం వల్లే జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతున్నారు 12వ రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి వేదికగా వచ్చే ఏడాది జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. కమ్మర్పల్లి స్టేడియంలో ఏర్పాటు చేసిన 12వ రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 21 జిల్లాల నుండి విచ్చేసిన క్రీడాకారులకు, ఆతిథ్యమి స్తున్న స్థానిక క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ,కమ్మర్‌పల్లిలో ఇంతటి ప్రతిష్ఠాత్మక రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జరగడం బాల్కొండ నియోజకవర్గానికే గర్వకారణమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సహకారంతో కమ్మర్‌పల్లిలో నిర్మించిన భారీ స్టేడియం వల్లే నేడు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వహణ సాధ్యమవుతోందని స్పష్టం చేశారు. స్టేడియంలో ఇంకా కొన్ని అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయని స్థానిక సర్పంచ్ తన దృష్టికి తెచ్చారని ప్రస్తావిస్తూ, స్టేడియానికి ప్రహరీ గోడ (కాంపౌండ్ వాల్) నిర్మాణం మరియు నాణ్యమైన రహదారి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తగిన సమయం, అవకాశం వచ్చిన వెంటనే ఈ పనులన్నింటినీ తప్పకుండా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.త్వరలో పంజాబ్‌లో జరగబోయే జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టును ఈ టోర్నమెంట్ నుండే ఎంపిక చేయనున్నారని ఆల్ ఇండియా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శోభన్ వెల్లడించిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. కమ్మర్పల్లి స్టేడియంలో జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ మీట్ నిర్వహించాలన్న జాయింట్ సెక్రటరీ ప్రతిపాదనకు ఆయన సానుకూలంగా స్పందించారు. వచ్చే ఏడాది అన్ని హంగులతో, ఎక్కడా ఏ లోటు రాకుండా పంజాబ్ తరహాలో కమ్మర్పల్లి వేదికగా జాతీయ స్థాయి పోటీలను ఘనంగా నిర్వహిద్దామని ప్రకటించారు. ఇందుకు స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ అశోక్, నాయకులు, గ్రామస్తులందరి తరఫున పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.దేశంలోని అనేక రాష్ట్రాల్లో లేని విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో క్రీడాకారుల భవిష్యత్తు కోసం విద్య, ఉద్యోగాలలో 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి ప్రత్యేక జీఓ జారీ చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. దీనివల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో సీట్లు లభించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రతి 100 ఉద్యోగాలకు 2 చొప్పున (10,000 ఉద్యోగాల్లో 200 ఉద్యోగాలు) ప్రత్యేకంగా టాయించ బడతాయని వివరించారు. దీనికి అదనంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఆర్మీ, పోలీసు, బ్యాంకులు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ స్పోర్ట్స్ కోటా ద్వారా ఉజ్వల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఎక్కడికి వెళ్లినా కబడ్డీ, వాలీబాల్, సాఫ్ట్‌బాల్ వంటి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు బాల్కొండ నియోజకవర్గంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని పలువురు ప్రశంసిస్తుంటారని, నియోజకవర్గంలో క్రీడలు ఇంతలా అభివృద్ధి చెందడానికి మల్లేష్ గౌడ్ కృషి ఎంతో ఉందని కొనియాడారు. ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాల్లోని వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు), క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి క్రీడలనే తమ ఊపిరిగా భావిస్తూ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారని అభినందించారు. వారం రోజుల క్రితం వేల్పూర్‌లో గంగామోహన్, భూషణ్‌లు స్థానికంగా తయారైన ముగ్గురు జాతీయ స్థాయి, నలుగురైదుగురు రాష్ట్ర స్థాయి క్రీడాకారులను తనకు పరిచయం చేసినప్పుడు ఎంతో ఆనందం కలిగిందని తెలిపారు. అలాగే, నిజామాబాద్ జిల్లాకు చెందిన భవిష్య (భరిష్య) అనే క్రీడాకారిణి జాతీయ స్థాయిలో 'బెస్ట్ ప్లేయర్' అవార్డు సాధించడం గర్వకారణమన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఆడిన ముగ్గురు స్థానిక క్రీడాకారులు భవిష్యత్తులో భారత జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. స్థానిక క్రీడాకారులకు క్రీడా కిట్ సమకూర్చాలని గంగామోహన్, భూషణ్ కోరారని, ఈ విషయంపై ఇప్పటికే దయానంద రెడ్డితో మాట్లాడానని, త్వరలోనే ఆ కిట్ అందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వం (మెంటల్ ఫిట్నెస్) అలవడుతుందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడలు జీవితంలో ఎదురయ్యే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మనోధైర్యాన్ని ఇస్తాయని తెలిపారు. పంజాబ్ నేషనల్ మీట్‌కు ఎంపికైతే మరింత కఠోర సాధన చేసి రాష్ట్ర, దేశ కీర్తిని ఇనుమడింపజేయాలని, ఒకవేళ ఎంపిక కాకపోయినా నిరాశ చెందకుండా, వేలాది మందిలో రాష్ట్ర స్థాయికి చేరుకోవడమే ఒక గొప్ప విజయమని భావించి మళ్లీ పట్టుదలతో ప్రయత్నించాలని క్రీడాకారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి సర్పంచ్ హారిక అశోక్, ఉప సర్పంచ్ అశోక్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ శోభన్, తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నవీన్, టోర్నమెంట్ సమన్వయకర్త (జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి) మర్కంటి గంగామోహన్, కమ్మర్పల్లి పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్, మోర్తాడ్ సర్పంచ్ ఆనంద్, కమ్మర్పల్లి వీడీసీ అధ్యక్షులు సుభాష్ గౌడ్, పీఈటీలు భూషణ్, మల్లేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.