
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో తాగునీరు వృధాగా పోతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారని పలువురు వాపోయారు. ఎల్ నినో ప్రభావం వలన నీటిని పొదుపుగా ఉపయోగించు కోవాల్సి ఉండగా అవేమీ పట్టనట్లుగా కొందరు నీటిని వృధా చేస్తున్నారు. నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నప్పటికీ, కాలనీవాసులు మాత్రం నీటిని వృధా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నీటి వృధాను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.