Wednesday, July 23, 2025
Homeఆంధ్రప్రదేశ్అంగన్వాడి కేంద్రాల్లో పేస్ యాప్ రద్దు చేయాలని వినతి

అంగన్వాడి కేంద్రాల్లో పేస్ యాప్ రద్దు చేయాలని వినతి

Listen to this article

పయనించే సూర్యుడు జూలై 22 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

అంగన్వాడి కేంద్రాల్లో పేస్ యాప్ రద్దు చేయాలని ఆత్మకూరు నియోజకవర్గం అంగన్వాడి వర్కర్లు ఆయాలు సోమవారం సిడిపిఓ కి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగనవాడి వర్కర్లకు. హెల్పర్లకు. మినీ వర్కర్లకు. గర్భిణీలు. బాలింతలు. పిల్లలకు ఫేస్ యాప్ రద్దు చేయాలని సెంటర్ నిర్వహణకు ఒక్క యాప్ మాత్రమే నిర్వహించాలని ఐసిడిఎస్ లక్ష్యం పేద గర్భిణీలు. బాలింతలు. చిన్నపిల్లల ఆహారం. ఆరోగ్యం. విద్య అందించాలని. పోషణ ట్రాకార్ యాప్. బాల సంజీవన్ యాప్. తీసుకొచ్చి లబ్ధిదారులకి ఆహారం ఓటిపి ద్వారా ఈ కేవైసీ చేసి ఫోటో క్యాచ్యువల్ చేస్తేనే సరుకులు ఇవ్వాలని పెట్టిన నిబంధనలను తొలగించాలని గతం వలె లబ్ధిదారులకు సంతకం పెట్టించుకుని సరుకులు ఇవ్వాలని కోరుచున్నాము కేంద్ర .రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ బాలింత పిల్లలకు అందిస్తున్న సరుకులు పోషణ ట్రాకర్. బాల సంజీవని యాప్ ద్వారా ఇవ్వాలని నిర్ణయించారు బియ్యం. పప్పు .ఆయిల్ గుడ్లు కిట్. ఈ సరుకులు అన్నియు ఒక్కసారిగా రావడం లేదు ఈ సరుకులు ఇచ్చేటప్పుడు అంగన్వాడి వర్కర్ ఫోటోతో పాటు లబ్ధిదారులకు ఫోటోలు తీసి మాత్రమే ఇవ్వాలి అధికారులు ఒత్తిడి చేస్తున్నారు లబ్ధిదారుల సరుకులు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఫోన్లు పనిచేయకపోవడం. నెట్ సిగ్నల్ లేకపోవడం. సర్వర్లు పనిచేయకపోవడంతో. వారు ఇసుకపోతున్నారు రెండు మూడు గంటలకు కూర్చొని సరుకులు ఉన్న ఇవ్వలేని పరిస్థితుల్లో లబ్ధిదారులు అంగన్వాడీలు మానసిక వేదనకు గురవుతున్నారు అంగన్వాడీలకు 2022లో ఫోన్లు ఇచ్చారు 90 శాతం ఫోన్లు చెడిపోయింది గ్యాపులకు నిర్వహణకు కావలసిన నెట్ స్పీడ్ ఇవ్వలేదు ఇటువంటి ట్రైనింగ్ లేదు మారుమూల గ్రామ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలలో అసలు సిగ్నలే ఉండదు కానీ లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ సరుకులు పంపిణీ మొత్తం ఆన్లైన్ ద్వారానే జరగాలని అధికారులు పెట్టే ఒత్తిడితో ప్రీ స్కూల్ దెబ్బతింటుంది ప్రభుత్వం స్కూల్ బలోపేతను చేస్తామని మాటల చెబుతూ అరాచీకలో ప్రభుత్వమే ఆటంకాలు కనిపిస్తుంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితేనే వచ్చే నెలలో సరుకులు వస్తాయని బెదిరిస్తున్నారు దీనివల్ల రాబోవు కాలంలో అంగన్వాడి సెంటర్ కి వచ్చే లబ్ధిదారులు పిల్లలు తగ్గిపోయే ప్రమాదం ఉంది కావున లబ్ధిదారులకు గతంలో వలె సంతకం పెట్టించుకుని సరుకులు ఇవ్వాలని అంగన్వాడీలకు గర్భిణీలు బాధితులు చిన్నపిల్లలకు ఎఫ్ ఆర్ ఎన్ రద్దు చేయాలని ప్రీ స్కూల్ బలోపేతనానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఆత్మకూరు సిడిపిఓ కి వినతి పత్రం అందజేయడం జరిగింది అని అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తెలిపారు కార్యక్రమంలో అంగనవాడి వర్కర్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ కమిటీ ప్రధాన కార్యదర్శి. పి రాధ. నాయకులు కే రమణమ్మ. ఆర్ .సుప్రజ. హ మీద. సునీత. విజయమ్మ. మస్తానమ్మ. వాణి. వేణు కుమారి. లక్ష్మీనారాయణమ్మ. పద్మావతి. లబ్ధిదారులు పాల్గొన్నారు యాప్ ల బెడద తప్పించాలని భోజనం విరామ సమయంలో అంగన్వాడి కార్యకర్తలు. లబ్ధిదారులకు ధర్నా చేసి వినతిపత్రం సమర్పించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments