
భూమి పూజ చేస్తున్న దృశ్యం…
రుద్రూర్, ఆగస్టు 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండల కేంద్రంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 12 లక్షల రూపాయలతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం ఎంపీడీవో భీమ్రావు, పంచాయతీ సెక్రెటరీ ప్రేమ్ దాస్, అంగన్వాడీ సూపర్ వైజర్ శ్రీలత స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, నాయకులు పత్తి రాము, తోట సంగయ్య, పత్తి లక్ష్మణ్, షేక్ ఖాదర్, కర్క అశోక్, షేక్ నిస్సార్, ఇందూర్ కార్తిక్, అంగన్వాడీ టీచర్ లు తదితరులు పాల్గొన్నారు.