
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
ఇసుక అక్రమ దందాని అరికట్టి, అందుబాటు ధరలో కావలసినంత ఇసుక అందుబాటులో ఉంచేందుకే సాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో ని చింతపల్లి ఎక్స్ రోడ్ వద్ద తెలంగాణ రాష్ట్ర మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాండ్ బజార్ ను
మైనింగ్ శాఖ ఎండి, వైస్ చైర్మన్ భవేష్ మిశ్రా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మరియు, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తో కలిసి ప్రారంభించారు. చింతపల్లి ఎక్స్ రోడ్ లోని నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో అందరికీ అందుబాటులో కావలసినంత ఇసుక లభ్యమయ్యేలా ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత మొట్ట మొదటి సారి మిర్యాలగూడలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక అక్రమ దందా అరికట్టడంతో పాటు సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచేందుకు సాండ్ బజార్ ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు టన్నుకు 1250 రూపాయల చొప్పున కావలసినంత ఇసుక అందుబాటులో ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని కావలసిన వారు అందరూ వినియోగించుకోవాలన్నారు