
పయనించే సూర్యుడు న్యూస్, ఏప్రిల్ 04 టేకులపల్లిప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి, టేకులపల్లి మండలం లో ఉన్న తడికలపూడి, కుంటల , ముక్కంపాడు, బేతంపూడి, నర్సాయిగూడెం, తొమ్మిదో మైలు, పరిసర ప్రాంతంలో పంట నష్టం వాటిలిందని టేకులపల్లి మండలం బిజెపి అధ్యక్షుడు తేజవత్ శంభు నాయక్ తెలియజేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాత్రి కురిసిన వర్షానికి, కళ్ళములో ఉన్న మొక్కజొన్న తడిసి ముద్దయిందని అక్కడక్కడ మిర్చి కూడా పాడైపోయిందని వారు తెలియజేశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని, వారు డిమాండ్ చేశారు.
