
పయనించే సూర్యుడు అక్టోబర్ 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈరోజు సిపిఎం సిపిఎం బృందం సర్వే నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు బానోత్ బాలాజీ పాల్గొని మాట్లాడారు ఈ సంవత్సరం కురిసినటువంటి అధిక వర్షాలకు ఏన్కూరు మండలంలోని పలు గ్రామాలలో పత్తి పంట పూర్తిగా దెబ్బతినిపోయిందని ఆయన అన్నారు ఖమ్మం జిల్లాలో ఏన్కూరు మండలంలో మిర్చి అధికంగా పండుతుందని ఈ వర్షాలకు మిర్చి పంట కూడా పూర్తిగా దెబ్బతిని పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులు పెరిగిన మందు కట్ల ధరలతో అల్లాడిపోతుంటే దానికి తోడు ప్రకృతి వైపరీత్యాలతో కూడా రైతు దివాళి తీసిపోతున్నాడని వాటికి తోడు ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రైతుల పట్ల నిమ్మకనిరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం ఆలోచించి పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు ఎద్దేడిసిన వ్యవసాయం రైతు ఏడ్చిన ప్రభుత్వాలు చరిత్రలో ముందుకు పోలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి దొంత బోయిన నాగేశ్వరరావు రైతు సంఘం మండల అధ్యక్షులు గుండా సత్యనారాయణ రెడ్డి పార్టీ మండల కమిటీ సభ్యులు ఏర్పుల రాములు భూక్య లక్ష్మ ఇటుకలలేని గంగరాజు ఎట్టి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు