Friday, July 4, 2025
Homeఆంధ్రప్రదేశ్అక్రమ కట్టడాలు కూల్చివేత ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి*

అక్రమ కట్టడాలు కూల్చివేత ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి*

Listen to this article

పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 17

ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16) ఆధ్వర్యంలో జాతీయ ఎస్టీ కమిషన్ కి ఫిర్యాదు

సిగ్గు సిగ్గు, గిరిజయేతరులతో అధికారులు రహస్య మంతనాలు , మీకేం కాదంటూ ఉన్నతాధికారులే భరోసా!.

గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వులు, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 30, అలాగే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల అనుసారం ఆర్ అండ్ బి స్థలాలు ప్రభుత్వ ఆక్రమిత భూములు, గ్రామ కంఠం భూమిలోని అక్రమలను, నీటి స్థలాల్లోని ఆక్రమణలను తొలగించి స్వాధీనపరుచుకోవాలని ఒకపక్క న్యాయస్థానాలు మరో పక్క ప్రభుత్వ జీవో ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకంగా 1/70 చట్టం మరియు ల్యాండ్ ఎంక్రొచ్ మెంట్ చట్టం 1905ని ఉల్లంఘించి విచ్చలవిడిగా నాన్ ట్రైబల్స్ స్థిర నివాసాలు అక్రమంగా ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. వీటిపై ప్రభుత్వ అధికారులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదని కావున చట్టాన్ని నీరుగారిస్తూ ప్రభుత్వాల జీవోలను ఉన్నత న్యాయస్థానాల ఉత్తర్వులను పాటించకుండా, 1/70 చట్టాన్ని అమలు చేయకుండా గిరిజనయేతరులతో కుమ్మక్కైన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు అందించినట్లు ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను తెలియజేశారు.అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ చొరవతో మొదట్లో కొంతమేరకు అక్రమ కట్టడాలు కూల్చివేత కొనసాగినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు, గిరిజనయేతరుల ఒత్తిళ్లు వలన తొలగింపు ప్రక్రియ పాక్షికంగా కొనసాగుతూ పూర్తిగా ఆగిపోయింది, అలాగే మన్నెం జిల్లాలో సీతంపేట ,పార్వతిపురం, ఏలూరు జిల్లాలోని కోటా రామచంద్రపురం ఐటీడీఏ, అల్లూరి జిల్లాలోని చింతూరు ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ మండల ప్రాంతంలో గల అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ అసలు మొదలు కాలేదని కేవలం పాడేరు, రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో కొంతమేరకు మాత్రమే తొలగింపు జరిగిందని అది కూడా నిబంధనలకు విరుద్ధంగానే గిరిజన యేతరులకు అనుకూలంగా తొలగింపు జరిగిందని జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలియజేశారు. గతంలో కూడా జాతీయ ఎస్టీ కమిషన్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతమైన అన్ని ITDA పరిధిలో 1/70 చట్టం సరిగ్గా అమలు కావటం లేదని, దీనివలన గిరిజనయే తురుల అక్రమ కట్టడాలు , వ్యాపారాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని దీనిపై చర్యలు తీసుకోవాలని కమిషన్ కు ఫిర్యాదు చేయగా ,ఆనాడు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎస్టీ కమిషన్ కు 1/70 పటిష్టంగా అమలు చేస్తున్నట్టు తప్పుడు నివేదికను సమర్పించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసి చట్టాలపై అవగాహన లేని ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులు రావటం వలన ఏజెన్సీ భూభాగంలోని ఆదివాసీలు, తమ చట్టాలు అమలు కాక హక్కులు కోల్పో వస్తుందని ఆవేదన వ్యక్తపరిచారు. వలస నాన్ ట్రైబల్ కు నిబంధనలకు విరుద్ధంగా ఏజెన్సీలో అక్రమ కట్టడాలకు NOC లు జారీ చేయటం, స్థానిక ధృవ పత్రాలు మంజూరు చేయటం వలన ఏజెన్సీ భూభాగాన్ని ఆదివాసీలు కోల్పోయారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ మధ్యకాలంలో చింతూరు డివిజన్లో చింతూరు ఎర్రంపేట గ్రామాలకు నోటీసులు ఇచ్చిన అధికారులు, గిరిజన యేతరులతో రహస్య మంతనాలు జరిపి మీకు ఏమి కాదు అని భరోసా ఇచ్చినట్లు ఆదివాసి సంక్షేమ పరిషత్ దృష్టికి వచ్చిందని ఇదే విషయాన్ని ఎస్టి కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు అటువంటి అధికారులపై క్రిమినల్ కేసులు వేయాలని కోరినట్లు తెలియజేశారు. చింతూరులో గల ఓ పత్రిక విలేకరు మరియు ఒక ఆర్ఎంపీ డాక్టర్ చెప్పుచేతల్లో చింతూరు డివిజన్ అధికారులు నడుస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఉన్నత స్థాయి అధికారులు కూడా ప్రభుత్వ న్యాయస్థానాల ఉత్తర్వులను పక్కనపెట్టి గిరిజన యేతరులకు కొమ్ము కాయటం సిగ్గుమాలిన చర్యగా ఆయన విమర్శించారు. న్యాయస్థానం ఉత్తర్వులు పాటించని అధికారులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆదివాసి చట్టాలను ఉల్లంఘించి ఏజెన్సీ ప్రాంతాలు నాశనం చేస్తూ విచ్చలవిడిగా వ్యాపారాలు కొనసాగిస్తున్న ఏ స్థాయి గిరిజన యేతరుడికి అయినా ఆదివాసి సంక్షేమ పరిషత్ తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. గిరిజన యేతరుల మత్తులో ఉండి కొంతమంది ఆదివాసులు వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు మరియు వాళ్ళకి బినామీలుగా ఉంటున్నారు. అటువంటి బినామీలకు కూడ తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా నాన్ ట్రైబల్ ఉచ్చులో నుంచి బయటికి రావాలని హితవు పలికారు.అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అక్రమాల తొలగింపు ప్రక్రియ కొనసాగాలని ఇతర జిల్లాల లో నీ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా తక్షణమే అక్రమ కట్టడాలు కూల్చివేత మొదలు పెట్టాలని ముఖ్యంగా చింతూరు డివిజన్ అధికారులు నాన్ ట్రైబల్ కి వత్తాసు పలకకుండా డివిజన్లోని అన్ని మండలాల్లో అక్రమాలు తొలగింపు ప్రక్రియ మొదలు పెట్టాలని లేకపోతే తమ ఉద్యమం ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments