
పయనించే సూర్యుడు ఆగస్టు 4 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న ఆగాపే ఆశ్రమంలో బడిగించుల రాముడు భార్య తులసి కుమారులు బాలాజీ, శ్రీకాంత్ వీరి కుటుంబము శ్రీకాంత్ 15వ పుట్టినరోజు శుభ సందర్భముగా అగాపే ఆశ్రమంలోని నిరాశ్రయులకు అన్నదానం ఏర్పాటు చేశారు.బంధుమిత్రులు కృష్ణవేణి, చందా లక్ష్మీదేవి, శంకరయ్య, కొప్పు కుమారి, నారాయణస్వామి పాల్గొన్నారు.కుటుంబం అంతా కలిసి ఆశ్రమం వారందరికీ భోజనాలు వడ్డించారు. ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
