
అత్యాచారం చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలి
రుద్రూర్, మార్చ్ 8 ( పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి తెల్ల గోపి):జగిత్యాల జిల్లాలో ఆశా వర్కర్ పై అత్యాచారం చేసిన దుండగుడిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రుద్రూర్ పీహెచ్ సీ ఆశా యూనియన్ అధ్యక్ష, కార్యదర్శి భూలక్ష్మి, వాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆశా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లతా, లక్ష్మి తదితరులు ఉన్నారు