పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 24 అల్లూరి సీతరామరాజు జిల్లా చింతూరు
మండలం లో అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని చింతూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విద్యార్థులకు లైంగిక వేధింపులనుండి మహిళల, పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర అనే అంశం పై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ పి రమేష్ మాట్లాడుతూ పోలీసుల సేవ పై అవగాహన కల్పించారు.పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం యొక్క విశిష్టత అధికారులు విద్యార్థులకు ఈ దినోత్సవం గురించి వివరిస్తూ వారి యొక్క త్యాగాన్ని స్మరించుకోవడం విధి నిర్వహణలో, దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో తమ ప్రాణాలను అర్పించిన వేలాది మంది అమర పోలీసుల త్యాగాలను ప్రతి ఏటా అక్టోబర్ 21న (ఆ వారంలో) స్మరించుకుంటామన్నారు పోలీసు వారి సేవలు – శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్ వ్యవస్థ సమాజానికి అందిస్తున్న నిస్వార్థ సేవలను అధికారులు వివరించారు:శాంతి భద్రతలు పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని. ప్రజలు నిశ్చింతగా జీవించడానికి అవసరమైన శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలు శ్రమిస్తారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100/112 ద్వారా ఎటువంటి ఆపద వచ్చినా, అందరికంటే ముందు స్పందించి ప్రజలకు సహాయం అందించేవారు పోలీసులేనన్నారు.నేర నియంత్రణ దొంగతనాలు, మోసాలు, గంజాయి వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను నియంత్రిస్తూ, నిందితులను చట్టం ముందు నిలబెడతారన్నారు.ప్రజా మిత్రులు రోడ్డు ప్రమాదాలు, వరదలు, అగ్ని ప్రమాదాల వంటి విపత్తుల సమయంలో పోలీసులు ముందండి నడిచి ప్రజలకు ఆసరాగా ఉంటారని తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థులలో దేశభక్తి, పోలీసుల పట్ల గౌరవం పెరగాలని యస్ ఐ తెలిపారు.


