
మున్సిపల్ కమిషనర్ శాంత కుమార్,& మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య
పయనించే సూర్యుడు ప్రతినిధి, (శ్రీరామ్ నవీన్), తొర్రూరు డివిజన్ కేంద్రం…అర్హులందరికీ, రేషన్ కార్డులు అందిస్తామని, తొర్రూరు మున్సిపల్ మంగళపల్లి రామచంద్రయ్య అన్నారు, ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన వార్డ్ సభలో వైస్ చైర్మన్ జీనుగా సురేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ప్రభుత్వ, పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం డివిజన్ కేంద్రంలోని 1, 5, 9, 13 వార్డుల్లో వార్డు సభలు నిర్వహించారు.4 పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను చేపట్టారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులు స్వీకరించారు. సభల్లో ప్రభుత్వ సంకల్పం, పథకాల వివరాలను ప్రజలకు తెలియజేసి అభిప్రాయాలను సేకరించారు పలు వార్డులలో జరిగిన సభల్లో మున్సిపల్ చైర్మన్ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా,
ఆయన మాట్లాడుతూ, నాలుగు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం 24 వరకు సభలు జరుగుతాయని తెలిపారు, 26వ తేదీన నాలుగు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అధికారులు నిజమైన లబ్ధిదారులు ఎంపిక చేసి, వారికి ఈ పథకాలు అందేలా చూస్తారని తెలిపారు, రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కమిషనర్ శాంతికుమార్, మేనేజర్ కట్ట స్వామి కౌన్సిలర్లు, భూసాని రాము. గూగులోత్ శంకర్. చకిలేలా అలివేలు సునీత జైసింగ్ వార్డు అధికారులు ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.