
పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 11:- రిపోర్టర్ (కే శివకృష్ణ)
అవయవ దానం పై అవగాహనతో ముగ్గురి ప్రాణాలు నిలబెట్టిన వరలక్ష్మి మరణం లోను జీవించే ఉంటారని, అటువంటి మహిళ బాపట్ల ప్రాంత వాసి కావటం గర్వకారణం గా ఉందని శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన బాపట్ల వివేకానంద కాలనీకి చెందిన మహిళ కొపనాతి వరలక్ష్మి మృత్యువుతో పోరాడి అలసిపోయారు. బతికే అవకాశం లేని విషాదకరమైన సమయంలో వరలక్ష్మి కుటుంబం తీసుకున్న సాహసోపేతమైన అవయవదానం ముగ్గురి ప్రాణాలు నిలబెట్టడం ఎంతో సంతోషంగా ఉన్నా, వరలక్ష్మి కన్నుమూయటం కలచి వేస్తుందని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు అన్నారు. అచేతనావస్థలో ఉన్నా మరొకరి ప్రాణాలు నిలబెట్టగలిగితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదన్నారు. చనిపోయినా మరొకరిలో జీవించే వరాన్ని ప్రసాదించటం కొద్ది మందికి మాత్రమే అటువంటి అవకాశం దక్కుతుందన్నారు. మరణం నుంచి జననంలోకి వచ్చి ఎందరికో పునర్జన్మనివ్వటం ఒక మహా సంకల్పంగా నిలిచిపోతుందని నరేంద్ర వర్మ అన్నారు. ఇటువంటి మహా దానమైన అవయవదానంలో వరలక్ష్మి కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపాలని అన్నారు. అవయవ దానం పై అవగాహన పెరగాలన్నారు.