
జనం న్యూస్ క్యాలండర్ ఆవిష్కరించిన ఇన్స్పెక్టర్ వరగంటి రవి
పయనించే సూర్యడు //ఫిబ్రవరి //22 //హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..జమ్మికుంట ఇన్స్పెక్టర్ వరగంటి రవి శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణంలో జనం న్యూస్ న్యూ ఇయర్ క్యాలండర్ ను ఘనంగా వివిస్కరించారు. ఈ సంద్భంగా ఇన్స్పెక్టర్ రవి మాట్లాడుతూ.. జనం న్యూస్ పత్రిక, న్యూస్ ఛానల్ ప్రజల గుండె చప్పుడవ్వాలని , సమాజంలో ప్రజలకు జరుగుతున్న అవినీతి, అన్యాయాలను ఎప్పటికప్పుడు తెలియజేసేదే దిన పత్రికలు, న్యూస్ చానల్ లు అని, వాటిని విస్మరించకుండా నిజాన్ని నిర్భయంగా వార్తలు రాస్తూ ప్రజలకు , ప్రభుత్వాలకు వారధులుగా ఉండాలని కోరారు, అదే విధంగా జనం న్యూస్ జమ్మికుంట మండల విలేకరి కొంగల కుమార్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లొ సీనియర్ విలేకర్లు నసీరుద్దీన్, అంబాల శ్రీరాం, దాట్ల శ్రీనివాస్, శివ, మరియు మాజీ యం. పి. టి. సి సభ్యులు జీడి దేవేందర్, జనార్ధన్ రెడ్డి, మరియు శ్రీకాంత్ రెడ్డి, రాజు, ఓదెలు, అడ్వకేట్ రాజు, సతీష్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.
