
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
ఇంద్రార్చితను సన్మానించిన బీఆర్ఎస్ శ్రేణులు
ఇంద్రార్చిత తల్లిదండ్రులు తదితర కుటుంబ సభ్యులను అభినందించిన అంజయ్య యాదవ్
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
ఆడపిల్ల చదువు ఆవనికి వెలుగు లాంటిదని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. గురువారం షాద్ నగర్ పట్టణానికి చెందిన పదుకొనే రాఘవేంధర్ రావు, మమత దంపతుల కుమార్తె ఇంద్రార్చితను మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కె. నరేందర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎం ఎస్ నటరాజన్, మాజీ కౌన్సిలర్లు, ఇతర నాయకులు కలిసి ఇంద్రార్చితను ఘనంగా సన్మానించి అభినందించారు. కష్టపడి చదువుకొని యుపిఎస్సిలో 739 వ ర్యాంకును సాధించి ఈ ప్రాంతానికి ఒక మంచి గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు. కృషి పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఇంద్రార్చిత నిరూపించారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల శ్రమ వృధా కాకుండా పిల్లలు గొప్ప విద్యాధికులైతే కుటుంబానికి ఈ సమాజానికి తద్వారా దేశానికి ఈ ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. మంచి ఉన్నత హోదాలో వచ్చాక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు విద్య ఆవశ్యకత గురించి పదిమందికి తెలపాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యుగంధర్, బచ్చలి నరసింహా, మురళీధర్ రెడ్డి, నక్కల వెంకటేష్ గౌడ్, నందకిషోర్ పిల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు..