
పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆత్మకూరు ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపో పరిధిలోని నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు ఆర్టీసీ డిపో ఎదుట తమ సమస్యల పరిష్కారం కోరుతూ రిలే దీక్షకు శ్రీకారం చుట్టారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ దీక్షలలో కార్మికుల సమస్యలను పరిష్కారం కోరుతూ నినాదాలు చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ రిలే దీక్షలో తమ కార్మికులు పాల్గొంటారని కార్మిక సంఘ నేతలు తెలిపారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలైన అసిస్టెంట్ డిపో సెక్రటరీ పద్మారావు, యూనియన్ ఆత్మకూరు సెక్రెటరీ మస్తానయ్య ఆధ్వర్యంలో డిపోకు చెందిన కార్మికులు ఈ దీక్షలో పాల్గొన్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు . సమస్యలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర యూనియన్ నేతలు తెలియపరిచిన పరిష్కారం కాకపోవడంతో తాము ఈ దీక్షలు ప్రారంభించినట్లు నేతలు తెలిపారు.ఉద్యోగ భద్రత కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రూపొందించిన జీవోను గత పాలకులు రద్దు పరచడంపై నిరసిస్తూ వెంటనే వాటిని కొనసాగించాలని అలాగే తమ కార్మికుల పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఈ సందర్భంగా మంగళవారం దీక్షను నిర్వహిస్తామని యూనియన్ అసిస్టెంట్ డిపో సెక్రటరీ పద్మారావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు