Thursday, March 6, 2025
HomeUncategorizedఆధునిక పద్ధతులు పాటించి లాభదాయకంగా వ్యవసాయ సాగు చేయాలి…. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఆధునిక పద్ధతులు పాటించి లాభదాయకంగా వ్యవసాయ సాగు చేయాలి…. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Listen to this article

పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 18: ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ ఆధునిక పద్ధతులు పాటించి లాభదాయకంగా వ్యవసాయ సాగు చేయాలి…. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 18. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ మార్కెట్ నుంచి నేరుగా రైతుల వద్ద నుంచి డ్రాగన్ ఫ్రూట్ కొనుగోలు చేసేలా కార్యాచరణ మట్టి పరీక్షలను సామర్థ్యం మేరకు నిర్వహించాలి రైతులకు సోలార్ ప్యానల్ పంపు సెట్ల ఏర్పాటుకు చర్యలు ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు పనులు పూర్తి చేయాలి ఉపాధి హామీ ద్వారా రైతుల పొలాల్లో నీటి గుంటలు ఏర్పాటు సింగరేణి మండలం చీమలపాడు గ్రామంలో రైతులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ ఆధునిక పద్ధతులను పాటించి లాభదాయకంగా వ్యవసాయ సాగు చేయాలని జిల్లా కలెక్టర్ జమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్, సింగరేణి మండలం చీమలపాడు గ్రామంలో పర్యటించి రైతులతో వివిధ అంశాలపై మాట్లాడారు. చీమలపాడు గ్రామంలో వెంకటేశ్వర్లు రైతుకు చెందిన పామాయిల్ పంటను, శ్రీనివాసరావుకు చెందిన డ్రాగన్ ఫ్రూట్ పంటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. డ్రాగన్ ఫ్రూట్ పంట, ఆయిల్ పామ్ సాగు, విద్యుత్, ఇతర సమస్యలపై పంట పొలం వద్ద చెట్టు నీడన క్రింద కూర్చొని జిల్లా కలెక్టర్ రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ సాగునీటి వసతి ఎంత వరకు ఉంది, పంటల దిగుబడి, రైతులకు గిట్టుబాటు అవుతుందా వంటి పలు అంశాలను ఆరా తీసి పలు సూచనలు చేశారు. అటవీ ప్రాంతమైనందున విద్యుత్ కనెక్షన్లు పొలాలకు అధికంగా లేవని, సబ్సిడీతో పొలాల వద్ద మోటార్లకు సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడతామని అన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన ప్రతి రైతుకు సోలార్ ప్యానల్స్ దశల వారీగా ఏర్పాటు చేస్తామని అన్నారు.ఆయిల్ పామ్ పంట సాగు వల్ల చాలా లాభాలు ఉంటాయని, అంతర్ పంటల ద్వారా మొదటి 3 సంవత్సరాలు ఆదాయం వస్తుందని, ఆయిల్ పామ్ పంట దిగుబడి ప్రారంభమైన తర్వాత సంవత్సరానికి లక్షకు తగ్గకుండా రైతులు ఆదాయం సంపాదిస్తారని అన్నారు. డ్రాగన్ ఫ్రూట్ పంటకు కోతుల సమస్య ఉందని, సోలార్ ఫెన్సింగ్ వేయడం ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయని కలెక్టర్ రైతులకు సూచించారు. డ్రాగన్ ఫ్రూట్ పంట ఎక్కడ అమ్ముతున్నారో తెలుసుకున్న కలెక్టర్, రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేసేలా కార్యాచరణ చేయాలని వ్యవసాయ అధికారిని ఆదేశించారు. మోర్, డి మార్ట్ వంటి షాపులతో మాట్లాడి పెద్దగా పంట పండే గ్రామాలకు నేరుగా వచ్చి కొనుగోలు చేసేలా చూడాలని అన్నారు. డ్రాగన్ ఫ్రూట్ పంట ఒకసారి వేస్తే 20 వత్సరాల వరకు పంట వస్తుందని, నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసేలా చేస్తే రైతులకు అధిక లాభాలు వస్తాయని ఆ దిశగా మన కార్యాచరణ ఉండాలని కలెక్టర్ అన్నారు. ప్రజలకు కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పంపిణీకి చర్యలు చేపట్టాలని అన్నారు. డ్రాగన్ పంటల వద్ద సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ తెలిపారు. రైతు పొలాల సాయిల్ టెస్టింగ్ పకడ్బందీగా చేయాలని అన్నారు. వేసవి కాలంలో మట్టి పరీక్షలు చేయాలని, రాబోయే నెల నుంచి సామర్థ్యం ప్రకారం మట్టి నమూనా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. అటవీ రక్షణ చట్టాల కారణంగా విద్యుత్తు లైన్లు ఏర్పాటు కష్టతరం అవుతుందని అన్నారు. రైతులకు అవసరమైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపారు. రైతుల పంటలు ఎండిపోకముందే ట్రాన్స్ ఫార్మర్ మరమ్మత్తు పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. గ్రామంలో రోడ్డు సమస్య ఉందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా, అటవీ బంధనలకు లోబడి గ్రామాలలో అవసరమైన మట్టి రోడ్ల ఏర్పాటుకు ఉపాధి హామీ క్రింద చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. అనర్హులకు ఎవరైనా ఇందిరమ్మ ఇండ్లు అందితే వివరాలు అందిస్తే విచారించి చర్యలు చేపడతామని, అదే విధంగా అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు తప్పనిసరిగా మంజూరు చేయడం జరుగుతుందని, మొన్న పెట్టిన జాబితా తొలి జాబితా మాత్రమేనని ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు. ఉపాధి హామీ క్రింద రైతులకు నీటిగుంటలు ఏర్పాటుకు అవకాశం ఉందని, అవసరం, ఆసక్తి గల రైతులు ముందుకు వస్తే వారి పొలాలలో ఉపాధి హామీ నిధులు వినియోగించి నీటి గుంటలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అన్నారు. గ్రామ సభలలో తీర్మానం చేస్తే పనులు ప్రారంభమవుతాయని అన్నారు. చెరువు నీళ్లు వినియోగించేలా చెక్ డ్యాం నిర్మాణ అవకాశాలు పరిశీలిస్తామని అన్నారు. సన్న రకం వడ్లకు సంబంధించి బోనస్ నివేదికలు ప్రభుత్వానికి అందాయని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నిధులు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. రైతు రుణమాఫీ సాంకేతిక సమస్యలను పరిష్కరించి అర్హులైన రైతులందరికీ అందేలా చర్యలు చేపడతామని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, సింగరేణి మండల తహసిల్దార్ సంపత్ కుమార్, ఎంపీడీవో సురేందర్, విద్యుత్ శాఖ ఏడి ఆనంద్, ఉద్యానవన శాఖ అధికారి వేణు, పంచాయతీ సెక్రటరీ కె. రామకృష్ణ, ఆర్ ఐ, ఏ.పి ఓ., సంబంధిత అధికారులు, రైతులు, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments