
పయనించే సూర్యుడు మే 4 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు పట్టణానికి చెందిన కిన్నెర నరసింహ రావు శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ మెంబర్ గా నియమితులయ్యారు. ఆయన గతంలో మండల నాయీ బ్రాహ్మణ సహకార సంఘం అధ్యక్షుడు, ఎల్ ఆర్ పల్లి పాఠశాల విద్యా కమిటీ మెంబర్ వ్యవహారించారు. ఈ పదవి కి ఎంపిక చేసిన మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డికి, పదవి లభించేందుకు సహకరించిన పట్టణ టిడిపి అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, జిల్లా తెలుగు యువత నాయకుడు పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.