
ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి నాగయ్య
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 21 నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఇందుర్ హైస్కూల్లో శనివారం జరుపుకున్న బతుకమ్మ సంబరాలు అంబరాన్ని ఉంటాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బోధన్ మండల విద్యాశాఖ అధికారి నాగయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిని సాంప్రదాయాన్ని భావితరాలకి అందించడం గొప్ప విషయమని మన ఆచార వ్యవహారాలను ఈ సంబరాలను పాఠశాల యజమాన్యం నిర్వహించిందని అన్నారు. పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తామని పిల్లలకు పండగ యొక్క విశిష్టతను తెలియపరిచే బాధ్యత ఉందని వివరించారు. మహిళా ఉపాధ్యాయురాలు విద్యార్థినిలు తెలుగు సాంప్రదాయాల ఉట్టిపడేలా చీరలు పూలు ధరించి ఆకర్షణీయంగా నిలిచారు తెలుగు సాంప్రదాయలను మైమరిపించే విధంగా రంగురంగుల పువ్వులు కాగితాలతో బతుకమ్మలను పేరించారు బతుకమ్మలకు సాంస్కృతిక సాంప్రదాయాలను అనుసరిస్తూ పూజలు నిర్వహించారు బతుకమ్మలను పాఠశాల ఆవరణంలో ఉంచి రకరకాల బతుకమ్మలు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు చిరునామాగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు ఇందూర్ హైస్కూల్లో అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్,రామారావు, పాఠశాల అడ్మినిట్రేటివ్ ఇంచార్జ్ స్వాతి, ఉపాధ్యాయురాలు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు