పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు మున్సిపాలిటీలో
స్వచ్ఛ టాటా మ్యాజిక్ డ్రైవర్లుగా హెల్పర్లకు ఉపాధి కల్పించినందుకు శనివారం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ని డ్రైవర్లు, హెల్పర్లు , రాజమ్మ రామారావు, రాజేష్, రాజు, చైర్మన్ కి పూలదండ వేసి శాలువా తో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ ఈ పాలకవర్గంలో ఐదు సంవత్సరాల పాటు మాకు ఉపాధి కల్పించారని
మున్సిపాలిటీకి జాతీయ స్థాయి అవార్డు రావడంలో చైర్మన్ , పాలకవర్గం, అధికారుల సూచనలతో తడి పొడి చెత్త వేరు చేయడంలో ఇబ్బందులు కలిగిన వారి సూచన మేరకు పనిచేశాము గాని దేశవ్యాప్తంగా అవార్డు వస్తదని భావించలేదన్నారు. చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు అందరికి మున్సిపల్ అధికారులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంగ, పద్మ, సంపత్, రెడ్డి సాల్మన్ రాజ్, రమ విజయ, మధువాని, మహేష్, నాగమణి, మల్లయ్య నాగ స్వామి తదితరులు పాల్గొన్నారు.