
పయనించే సూర్యుడు ప్రతినిధి, (శ్రీరామ్, నవీన్)., తోరూర్ డివిజన్ కేంద్రం
మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ డివిజన్ కేంద్రానికి చెందిన, బిజెపి శ్రేణులు,
మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు, మాజీమంత్రి,బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ ని ఈరోజు శామీర్ పేట లోని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపించాలని, అత్యధిక స్థాయిలో బీజేపీ అభ్యర్థులను బరిలో నిలిపి వారి గెలుపు కోసం కృషి చేయాలని, అన్ని విధాలా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్, జిల్లా కౌన్సిల్ మెంబర్ పల్లె కుమార్, నియోజకవర్గ సీనియర్ నాయకుడు గిరికత్తుల వెంకన్న,బీజేపీ తొర్రూరు అర్బన్ అధ్యక్షుడు పైండ్ల రాజేష్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కాగు నవీన్, బీజేపీ తొర్రూరు రూరల్ మండలం ప్రధాన కార్యదర్శి దేవరకొండ విష్ణు వర్థన్ చారి తదితరులు కలిసిన వారిలో ఉన్నారు…