
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 12 నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని తెలంగాణకల్లుగీతకార్మికసంఘం బోధన్ శాఖఆధ్వర్యంలోబుధవారం రోజున బోధన్ తహసీల్దారు కు ఈత వనంభూమికివెళ్ళేపానాది అక్రమణ కు గురైందనిసర్వేచేసి పానాదిని గుర్తించాలని కోరుతూ బోధన్ తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు అనంతరం తెలంగాణ కల్లుగీతకార్మికసంఘం జిల్లాకన్వీనర్ పి గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ బోధన్ పసుపువాగుప్రాంతంలో594 సర్వే నెంబరులో గల భూమి 8ఎకరాల6గుంటల ఈతవనం భూమిఉందని తెలిపారు. ఆభూమికి వెళ్ళడానికి బెల్లాల్ చెరువుపెద్దకాలువనుండిపానాది ఉండేదని దానినుంచి గీత కార్మికులు ఈతవనంకు వెళ్ళేవారని పేర్కోన్నారు. కాలక్రమేణాపానాది అక్రమణకుగురైందని ఆవేదన వ్యక్తం చేశారు ఈతవనానికివెళ్ళడానికి గీత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని అన్నారు. కావునరెవెన్యూ అధికారులు స్పందించిసర్వేచేసి పానాదిని అక్రమణదారులనుంచిబయటకు తీయాలని తహసీల్దార్ నుకోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలంగాణకల్లుగీత కార్మికసంఘం బోధన్ శాఖ అధ్యక్షుడుశంకర్ గౌడ్ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ సాయా గౌడ్ రాజేందర్ గౌడ్ లక్ష్మణ్ గౌడ్ కమలమ్మ,లక్ష్మి శ్రీధర్ గౌడ్ తదితరులు ఉన్నారు