
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 25 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోగల మేధా హై స్కూల్ లో సోమవారం ఈనాడు దినపత్రిక యాజమాన్యం వ్యాసరచన పోటీని నిర్వహించారు.ఈ పోటీల్లో మొదటి బహుమతి ఇసుకపల్లి లాస్య (10 వ తరగతి),రెండవ బహుమతి రంధి డిల్లేశ్వరి( 10వ తరగతి), మూడవ బహుమతి దట్టి జ్యోత్స్న( 9వ తరగతి) గెలుపొందారు. . కన్సోలేషన్ బహుమతులను హర్షిత పాణిగ్రహి ( 10వ తరగతి), తాటిపూడి లాస్య(10 వ తరగతి), జినగ చైత్ర (8వ తరగతి) విద్యార్థినిలు చేజిక్కించుకున్నారు