
అరుణోదయ సాంస్కృతిక జిల్లా సహాయ కార్యదర్శి మెంతేన కొండలరావు
పయనించే సూర్యుడు జులై 16 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: దేశంలో అధికారంలో ఉన్న మతోన్మాద బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పాలనలో ప్రజల మౌలిక సమస్యలు పక్కనపెట్టి కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు ప్రజా సంపాదన దోచిపెట్టె ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ మోడీ ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తుందని అరుణోదయ సాంస్కృతిక సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి మెంతెన కొండలరావు ఆరోపించారు. I బుధవారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతీస్తూ విభజించు పాలించు అనే నీతిని బిజెపి అవలంబిస్తుందని కలిసి ఉన్న ప్రజల మధ్య కులమతాలకు పేరుతో వైశామ్యాలు సృష్టిస్తూ దేశంలోని దళిత మైనార్టీలపై దాడులు చేసిందని ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తుందని ఇందులో భాగంగానే అడవి ప్రాంతంలో పోలీసు మిలిటరీ బలగాలతో నింపి అడవిలో నివసిస్తున్న ఆదివాసులను హింసించి చంపుతున్నారని ప్రశ్నించే మేధావులను జైల్లో పెట్టి నిర్బంధిస్తున్నారని కళాకారులుగా దీనిని వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత రాజ్యాంగంలోనే హక్కుల కోసం నిర్వహించే ఉద్యమానికి ప్రజలంతా ఆసరాగా నిలవాలని జులై 19న ఇల్లందులో జరుగు రాష్ట్రస్థాయి అరుణోదయ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కోట ప్రభాకర్ సుంకరి ఉపేందర్ అవినాష్ చంద్రకళ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.