
అమరవీరుల స్థూప నిర్మాణ శంకుస్థాపన కొరకు ఆహ్వానం
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
తెలంగాణ రాష్ట్రo సిద్ధించడానికి తొలి దశ మరియు మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన అమరులను ఎల్లప్పుడూ స్మరించుకునే విధంగా వారి జ్ఞాపకార్థం అమరవీరుల స్థూప నిర్మాణ శంకుస్థాపనకు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను మరియు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ను జేఏసీ నేతలు ఆహ్వానించడం జరిగిందని,ఇందుకు వారు సానుకూలంగా స్పందించారని అన్నారు, అలాగే అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించి,అట్టి స్తూపం యొక్క నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ… రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో నిర్మించబోయే అమరవీరుల స్థూపం చరిత్రలో నిలిచే విధంగా,ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా, తెలంగాణ సాధించడంలో అమరులైన వారినీ స్మరించుకునే విధంగా ఈ స్థూపం ఉండాలని అన్నారు.ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఏం జనార్ధన్ మాట్లాడుతూ ఈ వారంలోనే ఒక తేదీని ప్రకటిస్తామని, ఆరోజు అమరవీరుల స్థూప నిర్మాణానికి భూమి పూజ చేస్తామని అన్నారు. ఇట్టి కార్యక్రమానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం,స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ లు ముఖ్య అతిథులుగా వస్తారని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వినయ్,జేఏసీ వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ టి.కరుణాకర్, జేఏసీ కన్వీనర్, గ్రంథాలయ కమిటీ వైస్ చైర్మన్ నక్క బాల్ రాజ్ యాదవ్,గొర్ల రాము,అర్జునప్ప తదితరులు పాల్గొన్నారు.
