
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఎర్రగట్ల మండలం లో నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్ మరియు ఏర్గట్ల మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులుఈ రోజు సోమవారం రోజున ఏర్గట్ల మండలం దోంచంద గ్రామములో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశానుసారం వెళ్లి పరిశీలించిన మండల గ్రామ కాంగ్రెస్ నాయకులు… ఇదే గ్రామానికి చెందిన పుట్టి కాశమ్మ ఇల్లు నిర్మాణం ప్లాస్టింగ్ దశలో యుందని త్వరలో గృహ ప్రవేశం కూడా చెయ్యటం జరుగుతుందని ఇప్పటికే పనిని బట్టి 4 లక్షల వరకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందని పని పూర్తి కాగానే మొత్తం డబ్బులు ఇస్తుందని అన్నారు. ఇండ్లు నిర్మాణం జరుగుతున్న లబ్ధిదారుల కుటుంబాలు సీఎం రేవంతన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏర్గట్ల మండల పరిధిలోని అన్ని గ్రామాలలో కూడా ప్రభుత్వ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినవారు త్వరగా పూర్తి చేసుకోవాలని, పనిని బట్టి ప్రతి వారం డబ్బులు ప్రభుత్వ ఇస్తుందని, ఇంకా అర్హత యుండి ఇండ్లు కట్టుకునేవారు కూడా యుంటే మీ గ్రామపంచాయతీ లలో దరఖాస్తులు అందజేయాలని రూపాయి ఖర్చు కాకుండా మంజూరు ఇవ్వడం జరుగుతుంది. ఇండ్లు లేనివారందరూ ప్రభుత్వ ఇచ్చే ఈ పథకాన్ని పార్టీ లకు అతీతంగా అర్హులు అందరూ ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమములో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్, కొర్రిపల్లి లింగారెడ్డి, వంకాయల వెంకట్ రెడ్డి, ఆశిరెడ్డి హన్మంత్ రెడ్డి, పెద్దకాపుల లింగారెడ్డి, ఇప్ప మల్లారెడ్డి, బద్దం లింగారెడ్డి, రేండ్ల రాజారెడ్డి, ముస్కు మోహన్, పన్నాల నర్సారెడ్డి, కూరాకుల బొర్రన్న, ఇబ్రైంపట్నం చిన్న భూమన్న, ఇబ్రైంపట్నం పెద్ద ముత్తెన్న, దండేవైనా సాయి, మేకల సాయన్న, రషీద్,ఆశన్న,వెంకన్న,అజయ్, మాణిక్యం, గణపతి మరియు మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.