
ఎమ్మెల్సీ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణి
పాల్గొన్న స్థానిక మండల నాయకులు,కార్యకర్తలు లబ్దిదారులు
( పయనించే సూర్యుడు ఆగస్టు 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఉమ్మడి పాలమూరు జిల్లా లో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పలువురు అత్యవసర వైద్యం కొరకు ఆర్థిక సాయం కోరగా వారి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి సహాయనిధికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసు చేయగా కరివేన గ్రామం భూత్పూర్ మండలానికి చెందిన ఎం.చంద్రశేఖర్ రెడ్డి 2 లక్షలు,ఎక్కువైపల్లి విలేజ్ కడ్తాల్ మండల్ కు చెందిన జోగు శ్రావణ్ 2 లక్షలు,దేవరగద్ర కి చెందిన ఏ.పుష్పలత కు 2 లక్షల 20 వేల ఎల్ ఓ సి లు, మరియు షాద్ నగర్ కి చెందిన జైనాబి, శ్రీనివాస కాలనీకి చెందిన కే. అశోక్,పద్మావతి కాలనీ కి చెందిన వి.ధరణి దేవి బూరుగు గడ్డ తండాకు చెందిన మూడవత మంగమ్మ, దేవునిపల్లి గ్రామానికి చెందిన జి మంజుల, బూర్గుల గ్రామానికి చెందిన లింగారెడ్డిగూడ నరసింహులు,కిషన్ నగర్ గ్రామానికి చెందిన కావేటి మంగమ్మ లకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి షాద్ నగర్ ఎమ్మెల్సి కార్యాలయం లో లబ్ధిదారులకు అందచేశారు.ఈ కార్యక్రమంలో ఫరూక్ నగర్ వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్, కిషన్ నగర్ మాజీ సర్పంచ్ శ్రీశైలం యాదవ్,దేవుని పల్లి మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్, బురుగు గడ్డ విలేజ్ ప్రెసిడెంట్ రవీందర్ నాయక్,దేవునిపల్లి బిఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ యాదయ్య,నగరం శ్రీనివాస్ గౌడ్,జయంత్ రెడ్డి, గోవిందు,మల్లయ్య,సురేష్, మహేష్ ,కుమ్మరి ప్రశాంత్,మంగలి శివ తదితరులు పాల్గొన్నారు.
