
పయనించే సూర్యుడు ఏప్రిల్ 9 న్యూస్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
ఏఐసీసీ పీసీసీ ఆదేశాల మేరకు భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో 5.వరోజు భీంగల్ మండల్ మెండోరా బాబా పూర్ ,కుప్కల్ ,జాగిర్యాల్ ,సుదర్శన్ నగర్ తండా ,సంతోష్ నగర్ తండా గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బొదిరే స్వామి మరియు డిసిసి ప్రధాన కార్యదర్శి కుంట రమేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, మహనీయులైన మహాత్మా గాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తూ దేశంలో మత వీద్వేషాలను రెచ్చగొడుతున్నారని వారి ప్రయత్నాలను తిప్పి కొట్టడానికి భారత కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టిందని, తెలిపారు. ఇలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల కోసం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారని, గృహ జ్యోతి పథకం కింద ఉచిత కరెంటు ఉచిత సిలిండర్ ఫ్రీ బస్సు, మహిళలకు,వడ్డీ లేని రుణాలు, రైతులకు రైతు రుణమాఫీ రైతు భరోసా సన్నబడ్లకు బోనస్, రేషన్ షాప్ ల ద్వారా సన్న బియ్యం పంపిణీ మొదలగు పథకాలను ప్రజలకు అందించి బడుగు బలహీన వర్గాల కళ్ళలో ఆనందాన్ని చూస్తున్నారు. కావున రాబోయే రోజుల్లో మహిళలు రైతులు ప్రజలంతా కూడా రేవంతన్న కి వెంట ఉండి ఈ మా ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జేజే నరసయ్య,మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, మల్లెల లక్ష్మణ్ బీసీ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు కోరాడి రాజు, అనంత్ రావు,గోపాల్ నాయక్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భోజ గౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నాగేంద్రబాబు, బాల్కొండ నియోజకవర్గ యువజన అధ్యక్షులు చరణ్ గౌడ్ , భీంగల్ మండల మహిళా అధ్యక్షురాలు కల్పన, గంగామణి, రాజేశ్వర్ గౌడ్, మురళి, పల్లె శేఖర్,లింబాద్రి, రమేష్,కిసాన్,మిరాజ్,కలీం, కిస్టోడ బాబన్న,రాగుల మోహన్,పిట్ల్ శీను,సురేష్, సాగర్ కృష్ణ కిషన్ గంగాధర్ నారాయణ బొర్రన్న,అప్పల రాజేశ్వర్,శ్రీను,రత్నం,ప్రశాంత్ శ్రీకాంత్,సురేష్,కుర్తి లాల్ ,శివ గంగులి,గోపి,విగ్నేష్,రాకేష్, జుబేర్,అఖింమ్,గంగా బాపు తదితరులు పాల్గొన్నారు
