
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు,రియల్ ఎస్టేట్ దందాలో అధికారుల వాటా ఎంత.?
అధికారుల చేతి వాటానికి ఏజెన్సీ చట్టాలు నిర్వీర్యం- జిఎస్పి ములుగు అధ్యక్షుడు పూనెం ప్రతాప్.
పయనించే సూర్యుడు: ఏప్రిల్ 18: ములుగు జిల్లా వాజేడు మండలం ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.
నూగూరు వెంకటాపురం; ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలలోఏజెన్సీ ప్రాంతచట్టాల, నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టెట్ దందాలు హెచ్చుమీరుతున్నా అధికారులు దిక్కులు చూస్తున్నారని,గొండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ మండిపడ్డారు. గొండ్వానా సంక్షేమ పరిషత్ సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చర్ల మండలం జిఎస్పి వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్ అధ్యక్షతన ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ పాల్గొని మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో ఎల్.టి.ఆర్ 1/70, చట్టాలను కళ్లుగప్పేందుకు గిరిజనేతరులు ప్రభుత్వ భూములను కోట్లాది రూపాయలతో కొనుగోలు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపార దందా సాగిస్తున్న తీరు చర్చనీయాంశమైందనీ అన్నారు.మండలం కేంద్రంలో ఉన్న ప్రభుత్వ భూములు గిరిజనేతరులు రియల్ ఎస్టేట్ దందా యథేచ్ఛగా కొనసాగిస్తూ,భారీఎత్తున భవన సముదాయాలు నిర్మిస్తున్నా,అధికార యంత్రాంగం మాత్రం మొక్కుబడి చర్యలకే పరిమితమవుతున్నాయని, ఏజెన్సీ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు పూను కోవడంలేదని ఆయన ఆరోపించారు.అధికారులు చేతివాటానికి అలవాటు పడి ఏజెన్సీ చట్టాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శి సైతం అనుమతులు లేని భవనాలకు నోటీసులకు ఇవ్వడం తప్ప చర్యలు తీసుకోవడం లేదని పూనెం ప్రతాప్ అన్నారు.రెవిన్యూ అధికారులు ఎల్.టి.ఆర్, 1/70 చట్టాలను ఆదివాసుల పైనే ప్రయోగిస్తూ, గిరిజనేతరుకు వెసులుబాటు కల్పిస్తున్నారని మండిపడ్డారు.వెంకటాపురం మండల కేంద్రంలో ఎల్.టి.ఆర్,1/59,1/70 చట్టాలకు విరుద్ధంగా గిరిజనేతరులు అనేక అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఇంతవరకు ఒక్క ఎల్.టి.ఆర్. కేసులు కూడా నమోదు చేయకుండా అధికారులు యంత్రాంగం దిక్కులు చూస్తున్నారని ప్రశ్నించారు.అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలపై ఎల్టిఆర్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు,లేని పక్షంలో త్వరలో గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం అవుతోందని అధికారులను హెచ్చరించారు. ఈయొక్క సమావేశంలో ఇర్ప అరుణ్ కుమార్,కోరం బన్నీ,పూనెం రవి కిరణ్, ఇర్పా అశోక్,సాయి తదితరులు పాల్గొన్నారు.