
పయనించే సూర్యుడు అక్టోబర్ 18 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత భావుసింగ్ నాయక్
చిరు వ్యాపారుల నుండి మొదలుపెట్టి కిళ్ళి కొట్టు వ్యాపారస్తులు దాకా ఈ ప్రైవేట్ వడ్డీ బ్యాంకులో వడ్డీ బారిన పడినవారు ఎందరో ఒకటి కాదు పదుల సంఖ్యలో ఏన్కూర్ మండల కేంద్రంలో ఈ వడ్డీ దందా మహిళల గ్రూపులే లక్ష్యంగా వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఏజెన్సీ గ్రామాల్లో సాగుతూ కోట్ల రూపాయల్లో వడ్డి దందా సాగుతుంది కొన్ని ముఖ్య శాఖల అధికారులు వీరికి అండగా ఉన్నాయనే సంకేతాలు మండల ప్రజల దృష్టిలో బాగా వినపడుతుంది ఈ మధ్యకాలంలో వారి వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారు ప్రైవేట్ వడ్డీ బ్యాంక్ ఫైనాన్స్ భరినపడి ఆర్థికంగా నష్టపోతున్నామని వారు గ్రహించలేకపోతున్నారు ఏన్కూర్ మండల కేంద్రంలో గుట్టు చప్పుడు లేకుండా మండల వాసులు కొంతమంది వడ్డీ వ్యాపారం కొనసాగిస్తూ వడ్డీకే కాకుండా చక్ర వడ్డీలు కూడా విధిస్తూ నరకయాతన చూపిస్తున్నారు అనే మాట ఎక్కువగా వినపడుతుంది వారి ప్రైవేట్ దందాల రూపంలో కోట్లాది రూపాయలకు అధిపతిగా మారిన వారు ఈ ఏన్కూర్ మండలంలో ఉన్నారు వీరి వడ్డీ వ్యాపారాలకు అడ్డుగా వస్తే ఎంతటికైనా తెగించిన సంఘటనలు కూడా ఉన్నాయి కొన్ని శాఖల అధికారులకు ప్రజాప్రతినిధుల సమావేశంలో నజరానా చెల్లిస్తుంటారు వారికి బలమైన అధికారాలు ప్రజాప్రతినిధులు అండగా ఉండడంతో గిరిజన చట్టాలు వారికి బంధుమిత్రులయ్యాయి దీంతో వీరి వడ్డీ వ్యాపారం ఆగడాలకు అంతే లేకుండా పోయిందని మండల ప్రజలు భావిస్తున్నారు గిరిజన ప్రజలు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గిరిజన ప్రజలు కోరుకుంటున్నారు ఇలా మనీ లాండరింగ్ కి పాల్పడుతున్న వారిని ప్రత్యేక నిగా పెట్టి గిరిజన ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వ మండల అధికారులకు పోలీస్ శాఖ వారికి బాధ్యత ఉందని మండల ప్రజలు గుర్తు చేస్తున్నారు