
పయనించే సూర్యుడు అక్టోబర్ 18 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఫైనాన్స్ వ్యాపారస్తులు ఏజెన్సీలో చట్టాలను అతిక్రమించి మరి అక్రమ దందాలు చేస్తున్నారు పేద ప్రజల బలహీనత వారి ఫైనాన్స్ వ్యాపారస్తుల పెట్టుబడి
ఫైనాన్స్ వ్యాపారస్తులు మొదట చెప్పిన దానికి చివరి వరకు పొంతన లేకుండా పోయింది ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన మహిళలు లక్ష్యంగా ప్రైవేట్ బ్యాంకులు వడ్డీలకు ఇస్తున్నారు ఏన్కూరు మండలం పిసా యాక్టు 1/70 లో ఉన్న ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ ఎలాంటి అనుమతులు గిరిజనేతరులకు చెల్లవు భూమి క్రయవిక్రయాలు కూడా చేయకూడదు ఇలాంటి అనేక కఠిన చట్టాలు అమలులోకి ఉన్న క్షేత్రస్థాయిలో ఈ కఠిన చట్టాలను అధికారులు అమలుపరచడంలో విఫలమవుతున్నారు దీంతో అక్రమ దందాలకు నిలయంగా ఏజెన్సీ ప్రాంతాలు మారిపోయాయి గిరిజన మహిళలే లక్ష్యంగా ప్రవేట్ బ్యాంకులో ఫైనాన్స్ వడ్డీలకు ఇస్తున్నారు ఐదుగురు మహిళ సభ్యులు పదిమంది గ్రూపుగా ఏర్పాటు చేసుకొని గ్రూపులోని ప్రతి ఒక్కరికి 30 వేల నుండి 40000 వరకు ఇస్తున్నారు నెలల వాయిదా పద్ధతిలో చెల్లించాలని కఠినమైన నిబంధనలు విధిస్తుంటారు ఇన్సూరెన్స్ పేరిట ప్రతి ఒక్క సభ్యుల నుంచి ఎంతో కొంత డబ్బును ముందే కోతకు కోసి మరి ఇస్తున్నారు గ్రూప్ సభ్యులలో ఏ ఒక్కరు వాయిదాలు చెల్లించకపోతే మిగిలిన వారు అందరూ కలిసి తప్పనిసరిగా కట్టాలి అనే కఠిన నిబంధనను పెట్టడంతో వీరి మితిమీరిన నిబంధన మూలంగా కొన్ని కుటుంబాల్లో మంటలు చిచ్చుపెట్టి కుటుంబ కలహాలకు దారితీస్తుంది