
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 17. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ లో బిఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ ఆధ్వర్యంలో సోమవారం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జన్నారం క్రాస్ రోడ్ నుండి మండల పరిధిలోని నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి జాతిపిత తెలంగాణ రాష్ట్ర సాధకుడు అపర భగీరధుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి పుట్టినరోజు సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వైరా యోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ గారి ఆధ్వర్యంలో కెసిఆర్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి కెసిఆర్ కు న్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని దేవాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం మండల కేంద్రంలోని చర్చి, మసీద్ లోప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు జనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

