
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా లో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. గన్ పార్క్ నుంచి బషీర్ బాగ్ ఈడీ కార్యాలయం వరకు భారీగా పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఈడీ కార్యాలయం ముందు బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ కు రూ.90 కోట్లు రుణం ఇస్తే మనిలాండరింగ్ జరిగినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.ఈ ధర్నా లో ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు హాజరయ్యారు..