
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 11 // కుమార్ యాదవ్ // హుజురాబాద్..
కమలాపూర్ మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమలాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు అందరు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు కు మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన సంఘసమస్కర్త, పూలె అన్నారు. సమాజంలో కుల పరమైన వివక్షలు అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని దారోబోసిన మహాత్ముడు మహాత్మాజ్యోతిబా పూలే అని తెలిపారు. ఆయన జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిపామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు దూడ శ్రీకాంత్, ఉపాధ్యక్షులు చేరాల రోహిత్ కుమార్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు చరణ్ పటేల్, బాలసాని రమేష్, పోడేటి భిక్షపతి, బొల్లం రాజిరెడ్డి,కిన్నెర కృష్ణమూర్తి, మారేపల్లి మహేష్,పాక చంద్రమౌళి,రమేష్,అసెంబ్లీ కార్యదర్శి ఆడెపు శ్రీకాంత్ ,మిల్కూరి అరవింద్,మొగిలిచర్ల శ్రీనివాస్,వైనాల వంశీ, మొండెద్దుల నాగరాజు, శ్రీధర్,మాట్ల రాజేష్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.