
- సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చిన ప్రణవ్..
పయనించే సూర్యడు // మార్చ్ // 18 // హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..
హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ని, బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు, మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తూర్పాటి లింగయ్య మర్యాదపూర్వకంగా హుజరాబాద్ లోని తన నివాసంలో ప్రణవ్ బాబు కలిశారు. జమ్మికుంట మండలం లో కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాల్సిందిగా వారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు మాట్లాడుతూ.. మాకు జమ్మికుంటలో కమ్యూనిటీ హాలు కావాలని ప్రణవ్ బాబును కోరడం జరిగింది అని తెలిపారు. వారు కూడా సానుకూలంగా స్పందించి కచ్చితంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. మా కమ్యూనిటీ హాల్ గురించి సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బేడ బుడగ జంగం_ జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తూర్పాటి లింగయ్య. తదితరులు పాల్గొన్నారు.