Friday, September 12, 2025
Homeఆంధ్రప్రదేశ్కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

Listen to this article

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 10 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును దొరవారిసత్రం లోని “కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం” కళాశాల మరియు పాఠశాల నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో భాగముగా ప్రాజెక్ట్ మేనేజర్ అయిన కె. బాలాజి మాట్లాడుతూ, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ లక‌్షణాలు, అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి,కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017, ఎ.ఆర్.టి మందులు, ఏ.పి.శాక్స్ యాప్ ,టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి తెలుపుతూ, మీ ద్వారా తెలియని వాళ్లకు తెలియజేయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ – బి. పార్వతి, లెక్చరర్ లు బి.యామిని, ఐ. అరుణ, ఓ.ఆర్.డబ్ల్యూ – వి.ఐశ్వర్య , ఎ.యన్.యమ్- జి. శ్రీ లత, పి.ఇ నాగార్జునమ్మ మరియు 120 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. తదుపరి క్రిష్ణాపురంఏరియా లో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కల్పించడం కోసం మీటింగ్ మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో 60 మంది ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. వీరిలో 11 మంది ప్రజలుకు నవజీవన్ సంస్థ ఎ.యన్.యమ్ ద్వారా హెచ్.ఐ.వి పరీక్షలు చేయించి వారి స్థితిని వారికి తెలియజేయడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments