
పయాణించే సూర్యుడు 21 రిపోర్టర్ భానుచందర్ 24 న జోగిపేట కు మందకృష్ణ రాక
ఈ నెల 24 న నిర్వహిస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్షన్ల పెంపుకై నిర్వహిస్తున్న సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో లో చెప్పిన విధంగా పెన్షన్లు పెంచాలనే డిమాండ్ తో వచ్చే నెల 09 తారీకు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సన్నాహకంగా సభ ఆందోల్ నియోజకవర్గంలో లో ఈ నెల 24 న సన్నాహక సభ నిర్వహించబోతున్నామని ఈ సభకు ఆందోల్ నియోజకవర్గంలోని వృద్ధులు వితంతువులు వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొనీ విజయవంతం చేయాలని సమన్వయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు
ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విధంగా వృద్ధులు వితంతువులకు 4000 వేలు వికలాంగులకు 6000, ఒంటరి మహిళలకు 4000 , కండరాల నరాల క్షీణత తో బాధ పడుతున్న వారికి 15000 వేల పెన్షన్ల ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రభుత్వం తో పెన్షన్ల దారుల తరపున తాడో పేడో తేల్చుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె సంజీవయ్య గారు, మాజీ ZPTC అర్జునయ్య గారు, కాశపాగ ఇమ్మయ్య జిల్లా ఎస్సి ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మనిటరింగ్ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు ఏర్పుల కృష్ణ, సంటెనోళ్ళ సంజీవయ్య, MRPS జిల్లా అధ్యక్షుడు మైసగల్ల బుచేంద్ర, పేద్ద గీత MMS రాష్ట్ర నాయకురాలు.కాకతీయ యూనివర్సిటీ నాయకుడు ఎర్రోళ్ల పోచయ్య, మాజీ కౌన్సిలర్ సంతోష్ ,చౌటకూర్ మండల MRPS అధ్యక్షుడు ఎర్రోళ్ల రమేష్, జిల్లా కార్యదర్శి,నల్లోల ప్రవీణ్. తుమ్మల యాదగిరి VHPS జిల్లా నాయకులు. ప్రశాంత్. అర్జునయ్య తదితరులు పాల్గొన్నారు