
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్ కిట్స్ వరంగల్ ఇంజనీరింగ్ కళాశాలలోని సెంట్రల్ లైబ్రరీలోఅసిస్టెంట్ లైబ్రేరియన్ గా పని చేస్తున్నముచ్చకుర్తి నిరంజన్‌కి డాక్టరేట్ ను ఆంధ్ర ప్రదేశ్ కుప్పంలోని ద్రవిడియన్ విశ్వవిద్యాలయం వారు పిహెచ్.డి డిగ్రీ అవార్డ్ ఇచ్చేసారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు.ఈ సందర్బంగా ప్రిన్సీపాల్ ప్రో.కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ఈయన గ్రంథాలయ శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎం. ఆంజయ పర్యవేక్షణలో అవైలబిలిటీ అండ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ఏ స్టడీ ఆఫ్ న్యాక్ అక్రిడేటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆఫ్ రంగారెడ్డి డిస్టిక్,తెలంగాణ స్టేట్అనే అంశంపై తన పరిశోధనను పూర్తి చేసి పరోశోధనగ్రంధాన్ని ద్రవిడియన్ విశ్వవిద్యాలయం పరీక్షల విభాగానికి సమర్పించారు ఈయన భారతదేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల గ్రంథాలయాలలో ముఖ్యంగా తెలంగాణలో ఎలక్ట్రానిక్ సమాచార వనరుల వాడకంలో మెళకువలు, వాటిఉపయోగాల గూర్చిపరిశోధన చేశారు. గ్రంధాలయ శాస్త్రసాహిత్యంలో అంతరాలను మరియు ప్రస్తుత ఎలక్ట్రానిక్ యుగంలో ఇటువంటి అధ్యయనం యొక్క ప్రాముఖ్యత మరియు అవసరాన్ని గుర్తించి విద్యార్థులు మరియు అధ్యాపకుల ప్రయోజనం కోసం నూతన పద్దతులను కనుగొన్నారు. అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని తన పరిశోధనపత్రాలనుసమర్పించారు.ఏం.నిరంజన్ గ్రంథపాలగుడిగా కిట్స్ వరంగల్ కళాశాలలో ఏడు సంవత్సరా లు మరియు మొత్తం 27 సంవత్సరాలు అనుభవం మరియు కాకతీయ యూనివర్సిటీ ఈ ఎస్ డి ఎల్ సి ఈ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలలో లైబ్రరీ సైన్స్ కోర్సులకు కౌన్సిలర్ గా 15 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా కిట్స్ కళాశాల యాజమాన్యం, రాజ్యసభ ఫార్మర్ ఎంపీ, కిట్స్ వరంగల్ చైర్మన్, కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, కిట్స్ వరంగల్ కోశాధికారి శ్రీ. పి.నారాయణరెడ్డి మరియు హుస్నాబాద్ నియోజకవర్గ ఫార్మర్ ఎమ్మెల్యే కిట్స్‌డబ్ల్యు అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రో.పి. రమేష్ రెడ్డి, లైబ్రేరియన్ కె. ఇంద్రసేనారెడ్డి, లైబ్రరీ కమిటీ చైర్ పర్సన్ అండ్ ఈ సి ఈ ప్రొఫెసర్ బి రమాదేవి, వివిధ విభాగాల డీన్‌లు, వివిధ విభాగాల విభాగాధిపతులు, ఫ్యాకల్టీ, స్టాఫ్ మరియు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ & పి. ఆర్.ఓ. డాక్టర్ డి. ప్రభాకరా చారి, అధ్యాపకులు మరియు సిబ్బంది డాక్టర్ ఏం. నిరంజన్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.