
పయనించే //సూర్యుడు//న్యూస్// ఫిబ్రవరి5
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
శాసనసభలో కుల గణన రిజర్వేషన్ల అంశంపై చర్చ సందర్భంగా మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి బీసీ కులగననకు బలపరిచిన సందర్భంగా మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే కి హర్షం వ్యక్తపరచడం జరిగింది
మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ప్రజా ప్రభుత్వము తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తపరుస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ప్రజా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున జేజేలు పలుకుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి కి & మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలపడం జరిగింది,మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలో బాణాల సంచా కాల్చి & మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
అత్యంత ప్రాధాన్యం ఉన్న కులగనన సర్వేను మరింత పకడ్బందీగా నిర్వహించడమే కాకుండా అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి అధికారికముద్ర కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి .చరిత్రలో నిలిచిపోతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో కుల గణన& ఎస్సీ వర్గీకరణ నివేదికను ప్రవేశపెట్టడంతో పాటు శాసనసభ& శాసనమండలి సభలో ఆమోద ముద్ర వేయడంతో మక్తల్ నియోజవర్గ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి& మిఠాయిలు పంచుతూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. కుల గణన& ఎస్సీ వర్గీకరణ సర్వే తో రాష్ట్రంలోని అన్ని కులాలకు ఎంత మేరకు ప్రాధాన్యం ఉందో అందరికీ తెలియజేశారని.. ఈ సందర్భంగా అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఈ నివేదిక దోహద పడుతుందని అన్నారు. 2011 జనాభా లెక్కలు తప్ప మిగతా ఇలాంటి సర్వేకు అధికారికముద్రలేదని.. సీఎం రేవంత్ రెడ్డి .చేపట్టిన కులగన సర్వేకు మాత్రమే అధికారికమైనదని దీనికి ప్రజా ప్రభుత్వ ఆమోదముద్ర ఉందని అన్నారు. దేశంలోనే కుల గణన సర్వే ను చేపట్టి.. దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించిన తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని.. తొలి సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. భవిష్యత్తులో కులగనన సర్వే విషయంలో తెలంగాణ రాష్ట్రం ఒక బెంచ్ మార్కుగా మిగతా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నవారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గణేష్. మక్తల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు . రవికుమార్ . గొల్లపల్లి నారాయణ. ఎండి ఫయాజ్. కల్లూరి గోవర్ధన్. వాకిటి హనుమంతు. కావలి శ్రీహరి. ఎండి శంషాద్వీన్. గుంతల రవి. కట్టా వెంకటేష్. మాధవార్ పేట.శివప్ప మాధ్వార్ ఎర్రం కోళ్ల వెంకటయ్య. మాధ్వార్ పేట నాగమ్మ . బాట విశ్వనాథ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
