
జనం న్యూస్ మే 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 31న హైదరాబాద్ జలవిహార్ లో జరిగే ఇరవై ఐదు వసంతాల మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ రూపొందించిన గోడపత్రికను టీయూడబ్ల్యూజే కూకట్పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం కూకట్పల్లి ప్రెస్ క్లబ్ వద్ద ఆవిష్కరించడం జరిగింది. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్కే దయాసాగర్, టియుడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ అధ్యక్షుల నిమ్మల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోహిరు నాగరాజు , సీనియర్ జర్నలిస్టులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలను ఏకతాటి పైకి తీసుకొచ్చి స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడంలో కీలక భూమిక పోషించిందని అన్నారు. టీజేఎఫ్ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం నారాయణ ఆధ్వర్యంలో జరిగే వేడుకలను విజయవంతం చేయాలని జర్నలిస్టు మిత్రులందరికీ పిలుపునిచ్చారు. గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో కూకట్పల్లి ప్రెస్ క్లబ్ టియుడబ్ల్యుజే నాయకులు వి భాస్కరాచారి, కైలాష్ నేత,జాషువా, ఆనంద్ రావు, తేళ్ల హరికృష్ణ, దాదే వెంకట్, బొమ్మ గోపి లక్ష్మణ్ గౌడ్, హరికుమార్ చౌదరి, షబ్బీర్, కుల్లరాజు, శ్రీనివాస్ రెడ్డి, హరి, చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.