
పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
మహిళ గౌరవిస్తామని మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంత పార్టీ కార్యకర్తలపైనే అసభ్యంగా మాట్లాడితే వారికి అండగా నిలిచి నాయకుడే కరువైనట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుల వివరాల ప్రకారం కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్య అనుచరుడు గాదే శివ చౌదరి అనే వ్యక్తి మహిళలను కార్యకర్తలను వేధిస్తున్నాడని కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ పిడికిటి గోపాల్ చౌదరి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నాయకుడు గాదె శివ చౌదరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులను కార్యకర్తల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని వద్ద నుండి ఫోన్ సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఇతను మహిళల పట్ల ప్రవర్తిస్తున్న ఆగడాలను అరికట్టాలంటే కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించాలని, పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఇప్పటికే హై కమాండ్ కు సమాచారం పంపినట్లుగా బాధితులు తెలుపుతున్నారు. ఇంతేకాక గతంలో బాలాజీ నగర్ లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు కాలనీవాసులు ఇల్లు ఖాళీ చేసి పంపించినట్లుగా బాధితులు తెలుపుతున్నారు. ప్రస్తుతం కె.పి.హెచ్.బి కేంద్రంగా బండి రమేష్ అండదండలతో కార్యకలపాలు జరుపుతున్నట్లుగా ఇల్లీగల్ దందాకు పాల్పడుతున్నట్లుగా పలువురు ఫిర్యాదు చేసినట్లుగా బాధితులు తెలుపుతున్నారు.