
పయనించే సూర్యుడు ,ఫిబ్రవరి 12,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక లో గల బ్రిలియంట్ జూనియర్ కాలేజ్ లో మొదటి సంవత్సరం విద్యార్థులు రెండో సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమంలో మొదటిగా వందేమాతరం గీతం ఆలపించి, అనంతరం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు వారి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు .అనంతరం బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ డా ” బియన్ఆర్ మాట్లాడుతూ ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు యునివర్సిటీలలో చదివి అత్యున్నత స్థాయికి చేరుకుంటున్నారు, మీరు కూడా మంచి స్థాయిలో ఉండాలి మీ లక్ష్యాలను చేరుకోవాలని దానికి బ్రిలియంట్ విద్యాసంస్థలు ఎప్పుడు మీతో ఉంటుంది అని తెలియచేసారు, అనంతరం నిన్న ప్రకటించిన “జె ఈ ఈ మెయిన్స్” లో 79% తో ఉత్తీర్ణత సాధించిన బి.సంయుక్త ను సన్మానించడం జరిగింది ,అనంతరం కాలేజీని విడిచి వెళ్ళిపోతున్నటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ కూడా ఈ రెండు సంవత్సరాలు అన్ని విధాలుగా విద్యార్థులను తయారు చేసినందుకు బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బిఆర్ఆర్ ను ఘనంగా సత్కరించారు, అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డా. బి.ఎన్.ఆర్, హెడ్మిసెస్ స్వర్ణ మేడం, అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.