
పయనించే సూర్యుడు న్యూస్ (ఫిబ్రవరి.27/02/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నారాయణవనం మండలంలోని కైలాసనాథ స్వామిని దర్శించుకున్నారు.ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు ఆలయ నిర్వహకులు ఘన స్వాగతం పలికారు, ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యేకు దర్శన భాగ్యం కల్పించారు.అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించగా, నిర్వహకులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలు చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.