
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 16 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించనున్న రేవంత్ రెడ్డి.ఏకంగా టెండర్ల పేర్లతో, సెటిల్మెంట్ల పేర్లతో దోపిడీ జరుగుతుంది అని సిట్టింగ్ మినిస్టర్ కూతురే బయట పెట్టడంతో కంగు తిన్న రేవంత్ రెడ్డి వర్గం.సీఎం అనుచరుడు రోహిన్ రెడ్డి దందాలు, సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి గురించి, రేవంత్ అంతర్గత విషయాలు బహిరంగంగా మీడియా ముందు ప్రస్తావించినందుకు కొండా సురేఖపై వేటు వేసేందుకు రేవంత్ రెడ్డి సిద్దమైనట్లు సమాచారం.
ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో కొండా సురేఖపై వేటు వేసే అంశంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద భద్రత తొలగింపు.హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న కొండా సురేఖ నివాసం వద్ద, మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతో పాటు, ఔట్ పోస్టును కూడా తొలగించిన పోలీసులు..మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖలోని ఫైల్స్ అన్ని అప్పగించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం…