
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి గెలిచిన జెట్లకు బహుమతుల అందజేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మరియు కొందుర్గు మండల నాయకులు ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 22 షాద్ నగర్ నియజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్) హైందవ ధర్మ పరి రక్షణ కోసం ఎన్నో యుద్దాలు చేసిన మహా వీరుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలకేంద్రంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో 11వ రాష్ట్ర స్థాయి ఓపెన్ మరియు రూరల్ కబడ్డీ టోర్నమెంట్ లో ఓపెన్ విభాగంలో 30 టీంలు పాల్గొన్నాయి. విన్నర్ టీం గా పండుగ సాయన్న టీమ్, రన్నర్ గా జ్యోతి క్లబ్ టీం లు నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి హాజరై గెలుపొందిన జట్లకు స్థానిక మండల నాయకులతో కలిసి బహుమతులు అందజేశారు. హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించిన మరాఠా యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆ మహానియున్ని స్మరించుకుంటు కొందుర్గు మండలకేంద్రంలో పెద్ద ఎత్తున కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించిన ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులను మరియు స్థానిక మండల నాయకులను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సాహం అందించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని క్రీడాకారులకు సూచించారు. గెలిచిన ఓడిన క్రీడల పట్ల నిరుత్సాహ పడవద్దని అన్నారు. రూరల్ విభాగంలో మొత్తం 30 జట్లు పాల్గొనగా, విన్నర్ గా మరికల్. రన్నర్ గా బాటసింగారం, మూడవ బహుమతి ఆగిర్యాల, నాల్గవ బహుమతి ఉడిత్యాల టీమ్ లు నిలిచాయి. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎం,పి,పి రాజేష్ పటేల్, జడ్పిటిసి తనయుడు ఎదిరా రామకృష్ణ, పిఎసిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాదేవ్ పూర్ రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచులు ఉమ్మెంత్యాల నర్సిములు, మాదేవ్ పూర్ రాజా రమేశ్వర్ రెడ్డి, రాంచంద్రయ్య, గంగన్నగూడ శేఖర్, తంగలపల్లి బాల్ రాజు, ఆగిరాల భీమయ్య, ఎంపిటిసి గోపాల్, ఉపసర్పంచ్ యాదయ్య గౌడ్, శివాజీ యూత్ అధ్యక్షులు , మొడ్సు యాదగిరి, బోయ శంకర్, ఈసారి సత్యం, చోడపురం శ్రీనివాస్, గండేటి విజయ్, బి ప్రవీణ్, అన్నారం రవిందర్ గౌడ్, కొణింటి సందీప్, ప్రశాంత్, చందు, ముట్ పూర్ వేణు, ఉమెంతలా క్రిష్ణ, శివా, శ్రీరంగాపూర్, రాజు, శేఖర్, నగేష్, యాదయ్య, దయ్యాల శేఖర్ తేజ క్రీడాకారులు, శివాజీ యూత్ సభ్యులు. గ్రామస్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.