
పయనించేసూర్యుడు ఆగస్టు 22 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం
మండల పరిధిలోని ఈడిగపల్లి సచివాలయం 2 నందు ఉద్యాన శాఖ శాస్త్రవేత్త రేణుక ప్రసాద్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ..మామిడి కాయల కోత తర్వాత మామిడి తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు కాయలు కోసిన తర్వాత ఏడు నుంచి పది రోజులు చెట్లకు విశ్రాంతినిచి,జూలై 20 లోగా కొమ్మల కత్తిరింపులు చేయాలి గుబురుగా పెరిగిన చెట్లలో సూర్యరశ్మి ,గాలి లోపలికి ప్రసరించేలా తల పైన కొమ్మలను కత్తిరించాలి,అదేవిధంగా తూర్పు పడమర దిక్కులలో కూడా కొమ్మలను కత్తిరించి గుబురుగా లేకుండా సూర్యరశ్మి ,గాలి చెట్ల లోపలికి చేరేలా చేయాలి.చీడపీడలు ఆశించిన కొమ్మలను,కాయల కోత తర్వాత తోటలలో పడి ఉన్న టెంకలను,ఎండు పుల్లలను ఏరి కాల్చివేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనిత, అగ్రికల్చర్ సిబ్బంది శ్రీకాంత్, రాజేష్ నాయక్, రైతులు పాల్గొన్నారు.