
పయనించే సూర్యుడు ఏప్రిల్ 9 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం కాకివాయి గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి దేవాలయం . వీధులలో నాలుగు సీసీ కెమెరాలను సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి బుధవారం ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.భద్రతా పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఎస్సై తిరుమలరావు తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని నాయకులు తెలిపారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ఈ చర్యలు ఉపయోగపడతాయని వారు చెప్పారు.ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి,చేజర్ల ఎస్సై తిరుమల రావు,గ్రామ నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.