
మండల విద్యా శాఖఅధికారి తేజావత్ వెంకటేశ్వరరావు.
పయనించే సూర్యుడు: ఏప్రిల్ 22;ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం లోని ప్రభుత్వం విద్యార్థుల సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పంపిణీ చేసిన క్రీడా సామాగ్రిని సద్వినియోగం చేసుకోవాలని వాజేడు మండల విద్యాధికారి తేజావత్ వెంకటేశ్వరరావు అన్నారు. పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు కూడా ముఖ్యమని ప్రభుత్వం పిల్లల శారీరక అభివృద్ధి కోసం ప్రతి పాఠశాలకు క్రీడ సామాగ్రిని కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు చేసిందని ఆ నిధులతో మండలంలోని ప్రతి పాఠశాలకు కావలసిన నాణ్యమైన క్రీడా సామాగ్రిని తెప్పించి పంపిణీ చేయడం జరిగిందని వెంకటేశ్వరరావు అన్నారు. ఈ క్రీడా సామాగ్రిని ఉపాధ్యాయులు సక్రమంగా ఉపయోగించి విద్యార్థులు జిల్లా రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొని పాఠశాలకు మండలానికి పేరు తెచ్చే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయునిపై ఉందని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. వాజేడు మండలంలోని పాఠశాలలకు క్రీడా సామాగ్రినీ జిల్లా పరిషత్ మండల పరిషత్ కె జి బి గురుకుల, ఆశ్రమ అన్ని పాఠశాలలకు వివిధ క్రీడలకు సంబంధించిన క్రీడ సామాగ్రి అందిస్తున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు బోధ బోయిన శ్రీనివాస్ ,దేవదానం, భావ్ సింగ్, ఇమ్రాన్, మనోజ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.